టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్ చిక్కుల్లో పడే అవకాశం వుందని తెలుస్తోంది. విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా వుండటంతో సభలు, ర్యాలీల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవని హామీ ఇచ్చిన తర్వాతే విజయ్ ప్రచార కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో.. కరూర్‌లో శనివారం ప్రచార ర్యాలీ నిర్వహించిన సందర్భంగా ఏర్పడిన తొక్కిసలాటలో చిన్నారులతో పాటు మహిళలతో సహా 36 మంది ప్రాణాలు కోల్పోయారు.