టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై బాలీవుడ్ నటుడు, నిర్మాత, సినీ విశ్లేషకుడు కమాల్ ఆర్ ఖాన్ (కేఆర్కే) మండిపడ్డాడు. టీమిండియా జట్టులో స్టార్ ప్లేయర్లైన యువరాజ్ సింగ్, సురేష్ రైనా కెరీర్‌ను విరాట్ కోహ్లీ నాశనం చేశాడంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా యువరాజ్ సింగ్, రైనాలను ఉద్దేశించి కేఆర్కే ట్వీట్ చేశారు. కోహ్లీ యువీని, రైనాను ఇంట్లో కూర్చోబెట్టాడని.. తన కామెంట్స్‌పై కామెంట్రీ చెప్పుకోండంటూ ట్వీట్ చేశారు.
కివీస్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌కు బీసీసీఐ ఎంపిక చేసిన జట్టులో యువరాజ్ సింగ్, సురేష్ రైనాలకు స్థానం కల్పించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. కోహ్లీనే రైనా, యువీలకు జట్టులో స్థానం లభించకపోవడానికి కారణమంటూ మండిపడ్డాడు. ఇక.. సురేష్ రైనా తన ట్వంటీ-20 మ్యాచ్‌ను ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌పై ఆడగా, విండీస్‌తో యువీ చివరి మ్యాచ్ ఆడాడు. ఆపై వీరిద్దరికీ జట్టు స్థానం దక్కలేదు. ఫిట్‌నెస్ లేమి కారణంగా వీరిద్దరిని బీసీసీఐ పక్కనబెట్టిందని తెలుస్తోంది.