అంతర్జాతీయ క్రికెట్‌కు రాబిన్ ఊతప్ప బైబై

బుధవారం, 14 సెప్టెంబరు 2022 (21:50 IST)
Robin Uthappa
అంతర్జాతీయ క్రికెట్‌కు క్రికెటర్ రాబిన్ ఊతప్ప బైబై చెప్పేశాడు. బుధ‌వారం అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌కటిస్తూ ఊత‌ప్ప ఓ ప్ర‌క‌ట‌న చేశాడు. 
 
టీ20, వ‌న్డే, టెస్టు క్రికెట్‌ల‌కు గుడ్ బై చెబుతున్న‌ట్లు స‌ద‌రు ప్ర‌క‌ట‌న‌లో ఊత‌ప్ప పేర్కొన్నాడు. దేశ‌వాళీ క్రికెట్‌లో స‌త్తా చాటిన ఈ క‌ర్ణాట‌క క్రికెట‌ర్‌... భార‌త జ‌ట్టులో స్థానాన్ని నిలబెట్టేందుకు నానా తంటాలు పడ్డాడు.
 
బ్యాట‌ర్‌గానే కాకుండా వికెట్ కీప‌ర్‌గా, స‌త్తా క‌లిగిన ఫీల్డ‌ర్‌గా, బౌల‌ర్‌గానూ మంచి ప్రావీణ్యం ఉన్న ఊత‌ప్ప‌.. భార‌త జ‌ట్టు త‌ర‌ఫున 46 వ‌న్డేలు, 12 టీ20 మ్యాచ్‌లు మాత్ర‌మే ఆడాడు. 
 
ఇక ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్‌, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, పూణే వారియ‌ర్స్, కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్ల‌కు ఊతప్ప ఆడాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు