విరుష్క వివాహం జరిపిన పురోహితుడు ఎవరో తెలుసా?

గురువారం, 14 డిశెంబరు 2017 (15:46 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల ఇటీవల జరిగింది. ఈ వివాహం ప్రపంచంలో వున్న బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ స్పాట్‌లలో ఒకటైన ఇటలీలోని టస్కనీ నగరంలో ఉన్న ఓ చిన్న గ్రామంలో జరిగింది. అయితే, ఈ పెళ్లిని జరిపించిన పురోహితుడికి ఓ స్పెషాలిటీ ఉందట. ఇపుడు విరుష్క పెళ్లి కంటే ఈ పురోహితుడి గురించే అధికంగా చర్చించుకుంటున్నారు. 
 
ఈ పెళ్లి చేసిన పురోహితుడి పేరు పవన్ కుమార్ కౌషల్. వయసు 46 యేళ్లు. పంజాబీ బ్రాహ్మణుడు. పంజాబ్‌లోని కపుర్తల జిల్లాలోని సాంధుచతా అనే గ్రామానికి చెందిన వ్యక్తి. ఈయనకు ఇటలీలో సొంత గుడి ఉందట. దీంతో గత 25 యేళ్లుగా ఇటలీలోనే ఉంటున్నారు. 
 
అయితే, విరుష్క పెళ్లి కార్యక్రమం ఒకటిన్నర రోజుల పాటు జరిగింది. ఇందులో అన్నీ తానై వ్యవహరించారట. వాస్తవానికి ఇటలీలో విరుష్క పెండ్లి జరగబోతున్నట్లు పవన్‌కు కూడా ముందుగా తెలియలేదట. 
 
ఓ పెండ్లి చేయాలని చెప్పారట కానీ.. ఎవరి పెండ్లో చెప్పలేదట. అక్కడికి వెళ్లాక విరుష్కను చూసి షాక్ తిన్నాడట. అంతేకాదు.. గత 25 ఏండ్లుగా ఎన్నో పెండ్లీలు చేసినా రాని గుర్తింపు.. ఈ ఒక్క పెండ్లితో పవన్‌కు వచ్చిందట. ఇప్పుడు ఇటలీలో పవన్ 'టాక్ ఆఫ్ ది టౌన్' అయ్యాడట. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు