భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తనలోని వక్రబుద్ధిని బహిర్గతం చేశారంటూ నెటినజన్లు ఆరోపిస్తున్నారు. ఈనెల ఐదో తేదీన జరిగిన గురుపూజోత్సవం సందర్భంగా విరాట్ కోహ్లీ ఓ ఫోటోను జతచేసి ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌పై ఇపుడు విమర్శలు చెలరేగుతున్నాయి.
టీచర్స్ డే శుభాకాంక్షలు చెబుతూ ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ఇందులో విరాట్ వెనుక కొందరు క్రికెట్ లెజెండ్స్ పేర్లు ఉన్నాయి. అందులో ద్రావిడ్, ధోనీ, గిల్‌క్రిస్ట్, స్టీవ్ వా, వివ్ రిచర్డ్స్, లారా, షాన్ పొలాక్, చివరికి మియందాద్ పేర్లు కూడా ఉన్నాయి.
తనను క్రికెటర్‌ను బాగా ఇన్‌స్పైర్ చేసిన క్రికెటర్ల పేర్లను ఇందులో ఉంచాడు విరాట్. అయితే ఇందులో కుంబ్లే పేరు లేకపోవడంపై ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు. ఇదే పద్ధతిగా లేదని విరాట్ మొహం మీదే చెప్పేశారు. కావాలనే కుంబ్లే పేరు తొలగించాడనీ కొందరు ఆరోపించారు.
ఇటీవల భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి అనిల్ కుంబ్లేను అవమానకర రీతిలో కోహ్లీ సాగనంపిన విషయం తెల్సిందే. దీనిపై నెటిజన్లు కోహ్లీ వైఖరిని తూర్పారబట్టారు కూడా. ఇపుడు విరాట్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన మెసేజ్‌పైనా అలాంటి విమర్శలే వస్తున్నాయి.
To all the teachers around the world and especially to the ones in the Cricket World.