ఐసీసీ వెల్లడించిన ర్యాంకింగ్స్ పట్టికలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. మొత్తం 887 పాయింట్లను కైవసం చేసుకున్న కోహ్లీ... మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు టీ20ల్లోనూ కోహ్లీ నెంబర్‌వన్ స్థానంలో ఉన్న విషయం తెలిసిందే.
కాగా, బౌలర్స్ ర్యాంక్స్‌లో జస్‌ప్రీత్ బుమ్రా 27 స్థానాలు ఎగబాకి 687 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. ఇది ఆయన కెరీర్‌లోనే బెస్ట్ ర్యాంక్. ఇక జట్టు పరంగా తీసుకుంటే భారత్ తన మూడవ స్థానాన్ని నిలబెట్టుకుంది.