కోహ్లీ ఓ మాస్టర్.. మైదానంలో అతనో బీస్ట్.. షోయబ్ మాలిక్

బుధవారం, 26 అక్టోబరు 2022 (15:02 IST)
ట్వంటీ-20 ప్రపంచ కప్ సందర్భంగా పాకిస్థాన్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. తానే మాస్టర్‌గా నిరూపించుకున్నాడు. 31 పరుగులకే 4 పరుగులకే కుప్పకూలిన భారత జట్టును చివరి వరకు ఆపద్భాంధవుడిగా ఆదుకున్నాడు. ఇంకా టీమిండియాకు కోహ్లీ విజయాన్ని ఖాయం చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 పరుగులు సాధించాడు.
 
ఈ సందర్భంగా కోహ్లీకి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కోహ్లీ జీవితంలో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడని క్రికెట్ ఫ్యాన్సుతో పాటు మాజీ ఆటగాళ్లు కితాబిచ్చారు. దీపావళి సందర్భంగా కోహ్లీకి శుభాకాంక్షలతో పాటు అభినందనలు కూడా వెల్లువెత్తాయి. దేశ క్రికెట్ ఫ్యాన్సే కాకుండా దాయాది దేశం నుంచి కూడా కోహ్లీని అభినందన లభించింది. 
virat kohli
 
పాకిస్థాన్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ కోహ్లీని ఆకాశానికెత్తేశాడు. ఇంకా ఆయన ట్వీట్ చేస్తూ.. 'వైట్ బాల్ క్రికెట్‌లో కోహ్లీ కంటే మెరుగైన ఆటగాడు మనకు దొరకడు. అతను ఒక బీస్ట్. "అతను నిలబడి బౌలింగ్ చేయగలడు, సిక్సర్లు కొట్టగలడు, ఇన్నింగ్స్ పూర్తి చేయగలడు." అంటూ కొనియాడాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు