టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోహ్లీ గొప్ప ఆటగాడనే విషయాన్ని అంగీకరిస్తాను. అయితే కోహ్లీ గొప్ప నాయకుడేనా?అంటూ అతని ప్రతిభపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ అనుమానం వ్యక్తం చేశాడు. జట్టును పదేపదే మార్చడం కోహ్లీకి ప్రతికూలంగా మారుతోందని స్మిత్ పేర్కొన్నాడు.
జట్టులో అతడి ఆలోచనలతో విభేదించేవారు కూడా ఉంటే జట్టుకు మేలు జరుగుతుందని స్మిత్ పేర్కొన్నాడు. మైదానంలో ఏ క్రికెట్ ఎలా ఆడాలో, ఎలా వుండాలో కోహ్లీ కొన్ని పరిమితులు విధించాడని.. మైదానంలో అతని తీరు, భావోద్వేగాలు సహచరులపై ప్రతికూల ప్రభావం చూపే విధంగా ఉన్నాయని ఆరోపించాడు. ఇలాగే దూకుడుగా, కోపంగా ఉంటే అతనిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.