విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు.. టెస్టు, వన్డే జట్ల కెప్టెన్‌గా పరుగుల యంత్రం

మంగళవారం, 22 జనవరి 2019 (14:21 IST)
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను సాధించాడు. 2018 ఏడాదికి గాను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన పురుషుల టెస్టు, వన్డే జట్లను ప్రకటించింది. గత ఏడాది అటు బ్యాట్స్‌మన్‌గా, ఇటు సారథిగా అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టిన విరాట్ ఈ అవార్డుకు ఎంపికయ్యాడు.
 
2018లో కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా విరాట్‌ చూపిన అద్భుత ప్రదర్శనకు గాను ఐసీసీ టెస్టు, వన్డే జట్టులకు కెప్టెన్‌గా అతని పేరును ప్రకటించామని ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఐసీసీ ప్రకటించిన టెస్టు జట్టులో భారత్‌, న్యూజిలాండ్‌ నుంచి ముగ్గురేసి ఆటగాళ్లు చోటు సంపాదించుకున్నారు. ఇక వన్డే జట్టులో భారత్‌ నుంచి నలుగురు, ఇంగ్లాండ్‌ నుంచి నలుగురికి స్థానం లభించింది. 
 
కోహ్లీకి తర్వాత రెండు జట్లలోనూ చోటు సంపాదించుకున్న భారత ఆటగాడిగా ఫాస్ట్ బౌలర్ బుమ్రా నిలిచాడు. గతేడాది 13 టెస్టుల్లో ఐదు శతకాలు నమోదు చేసి 55.08 సగటుతో మొత్తం 1,322 పరుగులు చేయగా.. 14 వన్డేల్లో ఆరు శతకాలతో కోహ్లీ మొత్తం 1,202 పరుగులు నమోదు చేశాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు