Google Maps: సముద్రంలోకి కారు.. అలల మధ్య ఇరుక్కుపోయింది.. కారులో ఆ నలుగురు ఎవరు? (Video)

సెల్వి

శనివారం, 13 సెప్టెంబరు 2025 (16:29 IST)
Car in sea
తమిళనాడులో గూగుల్ మ్యాప్‌‌ను గుడ్డిగా నమ్మిన యువకులకు చుక్కలు కనిపించాయి. వివరాల్లోకి వెళితే.. చెన్నై సిటీకి చెందిన నలుగురు యువకులు.. ఇద్దరు యువతులు.. కారులో జర్నీ చేస్తున్నారు. వీరందరూ స్నేహితులు. తమిళనాడు రాజధాని చెన్నై నుంచి వెళుతూ వెళుతూ సముద్రం తీరం వెంట కారు వెళుతుందని ఒకరు... వెళ్లదని మరొకరు పందెం కట్టారు. అసలే మద్యం మత్తులో వున్నారు. 
 
సముద్ర తీరం వెళ్లాలని గూగుల్ మ్యాప్ సాయం తీసుకున్నారు. కడలూరు ఓడ రేవు నుంచి పరంగి పెట్టై వరకు సముద్రం ఒడ్డు మీదుగా వెళ్లవచ్చని గూగుల్ మ్యాప్ చూపిస్తుందని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం జాతీయ రహదారి దిగి సముద్రం తీరానికి చేరుకున్నారు. 
 
అనుకున్నట్లు కడలూరు ఓడరేవు నుంచి జర్నీ చేస్తూ వుండగా.. సరిగ్గా సోధికుప్పం ప్రాంతానికి రాగానే మద్యం మత్తులో వున్న యువకుడు కారును సముద్రంలోనికి తీసుకెళ్లాడు. అంతే అలా వెళ్లిన వెంటనే సముద్రం అలల మధ్య కారు కూరుకుపోయింది. అలల తీవ్రత ఎక్కువగా వుండటంతో కారు సముద్రంలో చిక్కుకుపోయింది. 
 
అయితే వెంటనే స్పందించిన స్థానిక మత్స్యకారులు.. వెంటనే సముద్రంలోకి దిగి.. కారులోని ఆరుగురిని కాపాడారు. ఇసుకలో కూరుకుపోయిన కారును ట్రాక్టర్ల సాయంతో బయటకు లాగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, వార్తలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన సెప్టెంబర్ 11న జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

గూగుల్ మ్యాప్ మార్గం.. నేరుగా సముద్ర స్నానం!

తమిళనాడులోని కడలూరులో మద్యం మత్తులో గూగుల్ మ్యాప్ అనుసరించిన యువతీ యువకులు కారు సముద్రంలోకి దింపేశారు.

అదృష్టం బాగుండటంతో జాలర్లు కాపాడగా, కారును ట్రాక్టర్తో బయటకు లాగారు.

పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. pic.twitter.com/nmWR4qth4I

— greatandhra (@greatandhranews) September 13, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు