వివరాల్లోకి వెళితే వెస్టిండీస్ వన్డే టూర్ ముగించుకుని చార్టెడ్ ఫ్లైట్‌లో విరాట్ ఇండియాకు తిరిగి రావడం ఈ వివాదానికి దారితీసింది. వన్డే సిరీస్‌లో టీమిండియా విండీస్‌పై ఘన విజయం సాధించిన నేపథ్యంలో.. ఇందులో కోహ్లీ కూడా అజేయ సెంచరీతో అదరగటొట్టాడు. ప్రస్తుతం టీ-20 సిరీస్ జరుగుతున్నా.. సీనియర్ ప్లేయర్లకు బీసీసీఐ విరామం ఇచ్చింది. దీంతో విరాట్ కోహ్లీ స్వదేశానికి బయల్దేరాడు.
విరాట్ కోసం గ్లోబల్ ఎయిర్ చార్టర్ సర్వీస్ ప్రత్యేకంగా ఓ చార్టర్ ఫ్లైట్ ఏర్పాటు చేసింది. ఈ విషయాలను కింగ్ కోహ్లీ నెట్టింట పంచుకున్నాడు. అయితే చార్టర్ విమానంలో కోహ్లీ ప్రయాణించడం సరికాదని.. నిత్యం వాయుకాలుష్యం గురించి మాట్లాడే విరాట్, అనుష్కకు ప్రత్యేక విమానాలు పర్యావరణానికి ఎంతటి హానికరమో తెలీదా? అంటూ ఫైర్ అవుతున్నారు.