ఈ నేపథ్యంలో కోహ్లీ సెంచరీల కొరతపై టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో పంచ్‌లు విసిరాడు. 99.99, 99.97 పర్సంటేజ్ మార్కులు తెచ్చుకున్న ఇద్దరు స్టూడెంట్స్ మెరుగైన మార్కుల కోసం మళ్లీ పరీక్ష రాసారనే వార్తను షేర్ చేస్తూ ఇది కోహ్లీకి కూడా వర్తిస్తుందంటూ సెటైర్లు పేల్చాడు.
మృదుల్ అగర్వాల్, కావ్య చోప్రా అనే ఇద్దరు విద్యార్థులు ఈ ఏడాది ఫిబ్రవరి జరిగిన జేఈఈ పరీక్షలో 99.99, 99.97 పర్సంటేజ్ సాధించారు. ఈ ఫలితాలకు సంతృప్తి పడని వారు మళ్లీ పరీక్షలు రాసి 100 పర్సంటేజ్ సాధించారు. 300 మార్కులు 300 సాధించారు. రోజులు 6-8 గంటలు చదివేవాళ్లమని చెప్పారు.