ఫిట్‌నెస్ లేమి కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్టులో స్థానం కోల్పోయిన పాక్ క్రికెటర్ కమ్రాన్ అక్మల్.. పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ వకార్ యూనిస్‌పై ఫైర్ అయ్యాడు. వకార్ క్రికెటర్‌గా సక్సెస్ అయ్యాడే కానీ.. కోచ్‌గా మాత్రం విఫలమయ్యాడని స్పష్టం చేశాడు. పాకిస్థాన్ జట్టును తప్పుడు నిర్ణయాలతో అధఃపాతాళానికి నెట్టేశాడని క్రమాన్ అక్మల్ తీవ్రస్థాయిలో విమర్శించాడు. రెండుసార్లు కోచ్‌గా పనిచేసిన వకార్ వల్ల జట్టుకు ఎలాంటి ప్రయోజనం దక్కలేదని ధ్వజమెత్తాడు.
2015 ప్రపంచ కప్‌లో జట్టును ముందుకు తీసుకెళ్లేందుకు అతనివద్ద ప్రణాళికలు లేవని ధ్వజమెత్తాడు. యూనిస్‌ను ప్రపంచ కప్‌లో ఓపెనర్‌గా ఎందుకు పంపాడో కూడా తెలియదని.. ఆసియా కప్‌లోని మ్యాచ్‌లో అక్మల్ సెంచరీ చేస్తే.. ఆ తర్వాత మ్యాచ్‌లో అతనిని కిందికి నెట్టాడని అక్మల్ గుర్తు చేశాడు. ఇలాంటి నిర్ణయాలే పాకిస్థాన్ క్రికెట్ కొంపముంచాయని చెప్పుకొచ్చాడు.