దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంపై టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందులో ఢిల్లీ వాసి అయిన కోహ్లీ ఏం మాట్లాడాడంటే..? ఢిల్లీ కాలుష్యంపై ఆవేదన వ్యక్తపరిచాడు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించుకోవాలన్నాడు. కాలుష్యంపై చింతిస్తున్నట్లు తెలిపాడు.
కాగా ఢిల్లీలో దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. ఢిల్లీని ఒక గ్యాస్ చాంబర్‌గా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభివర్ణించగా, భూమి మీద అత్యంత కాలుష్య నగరం ఢిల్లీ అని అమెరికాకు చెందిన వాతావరణ రక్షణ ఏజెన్సీ ప్రకటించింది. ఈ దట్టమైన పొగమంచు కారణంగా సిటీలో జరగాల్సిన రెండు రంజీ మ్యాచ్‌లు సైతం రద్దయ్యాయి.