పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ బౌలింగ్‌లో తన సత్తా చాటుకుంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ ట్వంటీ-10లో తన సత్తా చాటాడు. తద్వారా టీ-10లో హ్యాట్రిక్ సాధించాడు. షార్జాలో జరుగుతున్న తొవి ట్వంటీ-20 లీగ్‌లో భాగంగా పక్తూన్స్ టీమ్ తరఫున ఆడుతున్న అఫ్రిది.. మరాఠా అరేబియన్స్ టీమ్ బ్యాట్స్‌మెన్ ముగ్గురిని వరుస బంతుల్లో ఔట్ చేశాడు.
ఈ వికెట్‌లో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వికెట్ కూడా ఒకటి కావడం విశేషం. టీ-10 క్రికెట్‌లో వేసిన తొలి బంతికే దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ రిలీ రోసోను అవుట్ చేయగా.. ఆ తర్వాతి రెండు బంతుల్లోనే బ్రావో, సెహ్వాగ్‌లను ఎల్బీడబ్ల్యూగా అఫ్రిది అవుట్ చేశాడు. తద్వారా ట్వంటీ-10 క్రికెట్లో తొలి హ్యాట్రిక్ తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఫక్తూన్స్ 25 పరుగుల తేడాతో మరాఠా అరేబియన్స్ టీమ్‌పై విజయం సాధించింది.