మహిళల వరల్డ్ కప్ : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

ఆదివారం, 23 జులై 2017 (15:04 IST)
మహిళల వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా లార్డ్స్ వేదికగా ఫైనల్ పోరు ఆదివారం ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు జట్ల మధ్య పోరు హోరాహోరీగా ఉంటుందని మొదటి నుంచీ అంచనాలు ఉన్నాయి. తొలిసారి ట్రోఫీని సాధించాలనే పట్టుదలతో మిథాలీ సేన ఉంది. 
 
2005 తర్వాత ఫైనల్స్‌కు చేరడం భారత్‌కు ఇది రెండోసారి. నాటి ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు ఓటమిపాలైంది. స్వదేశంలో మరోమారు కప్పు అందుకోవాలని ఇంగ్లండ్ జట్టు ఉవ్విళ్లూరుతోంది. మహిళల వరల్డ్ కప్‌లో ఫైనల్స్‌కు చేరడం ఇంగ్లండ్ జట్టుకు ఇది ఏడోసారి. మహిళల ప్రపంచకప్‌లో ఇంతవరకూ మూడు సార్లు విజేతగా నిలిచింది. 
 
బ్యాటింగ్‌కు అనుకూలం. కాస్త ఓపిక పడితే పరుగుల వరద ఖాయం. చిరుజల్లులు పడే అవకాశముందని వాతావరణ శాఖ నివేదిక. సోమవారం రిజర్వ్ డే. అయినా దీని అవసరం రాకపోవచ్చని అంచనా.
 
జట్టు వివరాలు.. 
భారత్: మిథాలీ (కెప్టెన్), రౌట్, మందన, హర్మన్‌ప్రీత్, దీప్తి, వేద, శిఖా పాండే, సుష్మ వర్మ, జులన్, రాజేశ్వరి, పూనమ్ యాదవ్. 
ఇంగ్లండ్: నైట్ (కెప్టెన్), విన్‌ఫీల్డ్, బీమోంట్, టేలర్, స్కివెర్, విల్సన్, బ్రూంట్, గున్, మార్ష్, శ్రుబ్‌సోలే, హార్ట్‌లే.

వెబ్దునియా పై చదవండి