మహిళల ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. ఎందుకంటే.. ఇప్పటివరకు 10సార్లు వరల్డ్‌కప్ జరిగితే ఆస్ట్రేలియా ఆరుసార్లు చాంపియన్‌గా నిలిచింది. అలాగే, భారత్‌తో ఇప్పటివరకు ఆడిన 42 మ్యాచుల్లో 34సార్లు ఆస్ట్రేలియా జట్టు నెగ్గింది. 2013 వరల్డ్‌కప్ తర్వాత ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3సార్లు విజయం సాధించి సరికొత్త చరిత్రను కంగారులు నెలకొల్పారు. అందుకే ఈమ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది.
కివీస్‌ను ఓడించి సెమీస్ బెర్త్‌ను దక్కించుకోవడంతో భారత్ జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఇదే ఫామ్‌ను కంగారూలపై కూడా చూపెట్టాలని మిథాలీసేన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. సెమీస్‌కు ఆతిథ్యమిస్తున్న గ్రౌండ్‌లో ఆసీస్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం భారత్‌కు కలిసొచ్చే అంశం. భారత్ ఇక్కడ ఐదు మ్యాచ్‌లు ఆడి ఉండటం అదనపు ప్రయోజనం. జట్టు పరంగా అందరూ అంచనాలను అందుకుంటుండటం లాభించే అంశంగా చెప్పుకోవచ్చు.
ఇంకోవైపు లీగ్ దశలో ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడిన ఆస్ట్రేలియా సూపర్ ఫామ్‌లో ఉంది. తుది జట్టులో పెద్దగా మార్పులు లేకుండానే బరిలోకి దిగే అవకాశముంది. టాప్ ఆర్డర్‌లో మూనీ, లానింగ్, పెర్రీ, బోల్టన్.. వీళ్లలో ఒక్కరు కుదురుకున్నా భారత్‌కు కష్టాలు తప్పవు. భారీ లక్ష్యాలను ఛేదించడంలో ఆసీస్‌ది అందెవేసిన చేయిగా ఉంది.