ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ అత్యధిక డిస్మిసల్స్‌తో వరల్డ్ కప్ రికార్డును సమం చేశాడు. ఒకే ఇన్నింగ్స్‌లో ఆరు క్యాచ్‌లు పట్టి... ఆడమ్ గిల్ క్రిస్ట్ (ఆస్ట్రేలియా), సర్ఫరాజ్ (పాకిస్థాన్)ల సరసన చేరాడు.
కాగా, శనివారం వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్, పాకిస్థాన్-ఇంగ్లండ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆదివారం టీమిండియా, నెదర్లాండ్స్‌తో ఆడనుంది. పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉన్న భారత జట్టు నాలుగో స్థానంలో నిలిచే జట్టుతో తొలి సెమీఫైనల్లో తలపడుతుంది.