ఆసియా కప్ టోర్నీ: పాకిస్థాన్ వర్సెస్ శ్రీలంకల మ్యాచ్

నాలుగు ఆసియా దేశాలు పాల్గొనే ప్రతిష్టాత్మక ఆసియా క్రికెట్ టోర్నమెంట్ బుధవారం నుంచి ప్రారంభంకానుంది. ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగనుంది. లంకలోని దంబుల్లాలో ఈ మ్యాచ్ జరుగనుంది.

పాకిస్థాన్ జట్లులో రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ తిరిగి జట్టులోకి రాగా, జట్టు కెప్టెన్‌గా షాహిద్ ఆఫ్రిది నియమితులయ్యాడు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌లు, ఆటగాళ్ల మధ్య విభేధాలు తదితర ఆరోపణలతో పాకిస్థాన్‌ జట్టులో ఒక మాజీ కెప్టెన్‌ రిటైర్‌ కాగా, మరో ఇద్దరు తమపై విధించిన నిషేధంపై అప్పీల్‌ చేసుకొని విజయవంతమయ్యారు.

ఇకపోతే.. ఉపఖండంలో 2011 ప్రపంచ కప్‌ టోర్నీ జరుగనుంది. ఈ టోర్నీని సన్నాహకంగా భావిస్తున్న వారు స్వదేశంలో జరుగుతున్న ఆసియాకప్‌ను సొంతం చేసుకుంటామన్న ధీమాతో ఉన్నారు. ఈ టోర్నీలో ఆతిథ్య శ్రీలంక, పాకిస్థాన్ జట్లతో పాటు.. భారత్, బంగ్లాదేశ్‌లు పాల్గొంటున్నాయి.

శ్రీలంక జట్టు.. ఉపుల్ తరంగ, తిలకరత్నె, దిల్షాన్, మహేళ జయవర్ధనే, సంగక్కర, మ్యాథ్యూస్, సమరవీర, కందంబి, కపుగెదేరా, కులశేఖర, మెహరూఫ్, రణదివ, ముత్తయ్య మురళీధరన్.

పాకిస్థాన్‌ జట్టు.. సల్మాన్‌ భట్‌, కమ్రాన్‌ అక్మల్‌, ఉమర్‌ అమీన్‌, ఉమర్‌ అక్మల్‌, షోయబ్‌ మాలిక్‌, అబ్దుల్‌ రజాక్‌, షాహిద్‌ అఫ్రిదీ, అజ్మల్‌, షోయబ్‌ అఖ్తర్‌, ఆసీఫ్‌, మహమ్మద్‌ ఆమీర్‌.

వెబ్దునియా పై చదవండి