ఇంగ్లండ్ వన్డే కెప్టెన్‌గ్ పాల్‌ కాలింగ్‌వుడ్!

ఇంగ్లండ్ వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్‌ బాధ్యతలను పాల్ కాలింగ్‌వుడ్‌కు అప్పగించారు. ప్రస్తుత కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్‌ గాయపడటంతో కాలింగ్‌వుడ్‌ను నియమించింది. ఇంగ్లండ్‌ క్రికెట్ జట్టుకు మరో మారు నాయకత్వం వహించాలని ఉవ్విళ్లూరుతున్న కాలింగ్‌వుడ్‌ తీవ్ర నిరాశకు లోనయ్యాడు. చివరకు తాత్కాలిక కెప్టెన్‌గా కూడా కెవిన్ పేరును పరిశీలించ లేదని బ్రిటీష్ పత్రిక ఒకటి పేర్కొంది.

ఎస్సెక్స్ జట్టుకు ఓపెనర్‌గా రాణిస్తున్న అలియస్టర్ కుక్‌కు టెస్టుల్లో స్ట్రాస్‌కు జూనియర్‌గా నియమితులైన విషయం తెల్సిందే. కాగా, గత జనవరి నెలలో పీటర్సన్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించారు. అయితే, తనకు మరోమారు జట్టుకు నాయకత్వ బాధ్యతలు పోషించాలని ఉన్నట్టు పలుమార్లు అభిప్రాయపడ్డారు.

చేతి గాయంతో బాధపడుతున్న స్ట్రాస్.. త్వరగా కోలుకుంటున్నారు. శుక్రవారం నుంచి వెస్టిండీస్‌తో ఆరంభమయ్యే తొలి వన్డేకు స్ట్రాస్ అందుబాటులోకి వస్తాడని ఇంగ్లండ్ జట్టు భావిస్తోంది.

అయితే, ఆయన అందుబాటులో లేని పక్షంలో కాలింగ్‌వుడ్ జట్టుకు నాయకత్వం వహిస్తాడని ఇసిబి వెల్లడించింది. దీనిపై జాతీయ సెలక్టర్ జెఫ్ మిల్లర్ మాట్లాడుతూ అధికారిక వైస్ కెప్టెన్ కాలింగ్‌వుడ్ కాదని, అయితే ఆండ్రూ అందుబాటులో రాని పక్షంలో కాలింగ్ సరైన వ్యక్తి అని చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి