ఐపీఎల్-3లో.. ఇక డమియన్ మార్టిన్ ఆడేది లేదు!

FILE
ప్రముఖ పారిశ్రామికవేత్త కింగ్ ఫిషర్ అధినేత ఫ్రాంచైజీ జట్టు రాజస్థాన్ రాయల్స్ నుంచి డమియన్ మార్టిన్ వైదొలిగాడు. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడే అవకాశం మార్టిన్‌కు చేజారిపోయింది.

వచ్చే వారంలో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు షేన్ వాట్సన్ రాయల్స్ జట్టులో చేరడంతో రాజస్థాన్ యాజమాన్యం టీమ్‌లో 19 మంది క్రికెటర్లను ఉండాలని నిర్ణయించింది. దీంతో డొమియన్ మార్టిన్ స్వదేశానికి తిరుగుముఖం పట్టాడు.

రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో మార్టిన్ పేలవమైన ఆటతీరును ప్రదర్శించడంతోనే అతడిని స్వదేశానికి పంపించేందుకు రాజస్థాన్ రాయల్స్ సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో మార్టిన్ కేవలం 19 పరుగులే సాధించడంతో అతనికి ఐపీఎల్ మూడో సీజన్‌లో ఛాన్సు చేజారిపోయిందని తెలిసింది.

ఈ విషయమై డొమియన్ మార్టిన్ తన ట్విట్టర్‌ బ్లాగులో చెబుతూ.. ఇకపై క్రికెట్ ఆట తనకు కలిసిరాదని ఆవేదన వ్యక్తం చేశాడు. మాజీ క్రికెటర్ల తరహాలో తాను ఇకపై కోచింగ్ విభాగంలో ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నానని ఈ 38 ఏళ్ల ఆసీస్ క్రికెటర్ మార్టిన్ వెల్లడించాడు.

వెబ్దునియా పై చదవండి