ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో భాగంగా, సెమీఫైనల్ తొలి మూడు స్థానాల్లో నిలిచేందుకు ఐదు జట్లు పోటీపడుతున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్‌డెవిల్స్, డెక్కన్ ఛార్జర్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ల మధ్య ఐపీఎల్ సెమీఫైనల్ తొలి మూడు స్థానాలను కైవసం చేసుకునేందుకు రసవత్తరమైన పోరు నెలకొంటోంది.
ఐపీఎల్ మూడో అంచెల పోటీల్లో ఇంకా మూడు లీగ్ మ్యాచ్‌లు మాత్రమే మిగిలివున్నాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్- కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ల 54వ లీగ్ మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం ధర్మశాలలో ప్రారంభమైంది. అలాగే డెక్కన్ ఛార్జర్స్- ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ల మధ్య 55వ లీగ్ మ్యాచ్ ఆదివారం రాత్రి ఢిల్లీలో జరుగనుంది.
ఇకపోతే.. ఐపీఎల్-3 చివరి లీగ్ మ్యాచ్‌లో బెంగాల్ దాదా సౌరవ్ గంగూలీ సేన కోల్‌కతా నైట్‌రైడర్స్, అగ్రస్థానంలో అగ్రస్థానంలో కొనసాగుతున్న ముంబై ఇండియన్స్‌తో తలపడునుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్-3 సెమీఫైనల్ బెర్త్‌ను ముంబై ఇండియన్స్ మాత్రమే ఖరారు చేసుకుంది. కానీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు సెమీస్ అవకాశాలు చేజారిపోయాయి. మిగిలిన మూడు సెమీఫైనల్ స్థానాలకు బెంగళూరు, ఢిల్లీ, డెక్కన్, కేకేఆర్, చెన్నై జట్లు సమరానికి సిద్ధమంటున్నాయి. వీటిలో డెక్కన్-ఢిల్లీల మధ్య జరిగే మ్యాచ్‌లో విజేతగా నిలిచే టీమ్ సెమీస్‌లో దూసుకెళ్తుంది. అలాగే పంజాబ్ జట్టును చెన్నై సూపర్ కింగ్స్ ఓడించినా, కోల్‌కతా ముంబైని మట్టికరిపించినా.. మిగిలిన ఇరు జట్లు సెమీస్‌లోకి ప్రవేశించాలంటే..? నెట్ రన్ రేటే తీర్మానించాల్సి వుంటుంది.
ఒకవేళ పంజాబ్, ముంబైలు ఓడిపోతే, చెన్నై, కేకేఆర్‌లు సునాయాసంగా సెమీస్‌లోకి అడుగుపెడతాయి. ఇకపోతే.. బెంగళూరు మరియు డెక్కన్-ఢిల్లీ మ్యాచ్‌లో ఓటమిని చవిచూసే జట్టు తలా 14 పాయింట్లతో సెమీస్‌లోకి దూసుకెళ్తాయి.