జులై 1న ఐసీసీ చీఫ్‌గా పవార్ బాధ్యతల స్వీకరణ!

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధ్యక్షుడిగా కేంద్ర ఆహార, వ్యవసాయ శాఖామంత్రి శరద్ పవార్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఐసీసీ పీఠాన్ని చేపట్టే రెండో భారతీయుడిగా శరద్ పవార్ రికార్డు సృష్టించనున్నారు. గతంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా ఈ పదవిని చేపట్టిన తొలి భారతీయుడిగా పేరు గడించిన విషయం తెల్సిందే. ఈయన 1997లో ఐసీసీ చీఫ్‌గా కొనసాగారు.

ప్రస్తుతం ఐసీసీ చీఫ్‌గా ఇంగ్లండ్‌కు చెందిన డేవిడ్ మోర్గాన్ కొనసాగుతున్నారు. ఈయన పదవీ కాలం ఈనెలాఖరుతో ముగియనుంది. ఆ తర్వాత జులై ఒకటో తేదీ నుంచి శరద్ పవార్ ఆ పదవిని చేపడుతారు. ఈ మేరకు. ఆదివారం జరిగే ఐసీసీ వార్షిక సమావేశంలో పవార్ ఎంపికకు ఆమోదముద్ర వేస్తారు. అలాగే, ఎగ్జిక్యూటివ్‌ బోర్డు ఉపాధ్యక్ష పదవికి ఆస్ట్రేలియా మాజీ ప్రధాని జాన్‌ హొవార్డ్‌ వేసిన నామినేషన్‌పై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నారు.

వెబ్దునియా పై చదవండి