ఈ సందర్భంగా హీరో ధనుష్ మాట్లాడుతూ, థాంక్ యూ డియర్ తన రెండో చిత్రమని, తమ్మారెడ్డి లాంటి సీనియర్ ప్రొడ్యూసర్ తమ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సినిమా తన కెరీర్‌లో కీలకమైనదని, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
నిర్మాత పప్పు బాలాజీ రెడ్డి మాట్లాడుతూ, ఈ చిత్రం ధనుష్‌కు గొప్ప పేరు తెస్తుందని, తమ్మారెడ్డి లాంటి ప్రముఖులు ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం తమకు ప్రోత్సాహకరంగా ఉందని అన్నారు. సినిమా ప్రేక్షకులను ఆకర్షిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
లైన్ నిర్మాత పుణీత్ రెడ్డి మాట్లాడుతూ, తమ్మారెడ్డి భరద్వాజ లాంటి సినీ పెద్ద ఈ ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం సంతోషకరమని, సినిమాను ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించామని తెలిపారు. ఈ చిత్రం యువతని కచ్చితంగా ఆకట్టుకొని విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
నటి నటులు - హెబా పటేల్ , ధనుష్ రఘుముద్రి , రేఖ నిరోషా, వీర శంకర్ , నాగ మహేష్ , రవి ప్రకాష్ , ఛత్రపతి శేఖర్ , బలగం సుజాత , సంక్రాంతి ఫేమ్ - శ్రీనివాస్ నాయుడు