మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

దేవీ

శుక్రవారం, 23 మే 2025 (18:51 IST)
Producer SKN
తెలుగు సినిమా పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో మనమంతా కలిసి సినిమాను కాపాడుకోవాలని అన్నారు నిర్మాత ఎస్ కేఎన్. ఈ రోజు ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఘటికాచలం సినిమా ట్రైలర్ లాంఛ్ లో గెస్ట్ గా పాల్గొన్నారు ఎస్ కేఎన్. ఈ ఈవెంట్ క్యూ అండ్ ఏ లో మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ థియేటర్స్ బంద్, రివ్యూస్, ప్రస్తుతం తెలుగు సినిమా పరిస్థితిపై తనదైన శైలిలో స్పందించి ఆకట్టుకున్నారు ఎస్ కేఎన్. ఆయన స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
 
నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ - ప్రేక్షకులు థియేటర్స్ కు రావడం తగ్గిపోయింది. ఇందుకు టికెట్ రేట్స్, పాప్ కార్న్ ధరలు, వారమంతా ఒకే టికెట్ ధరలు ఉండటం..ఇలా అనేక కారణాలు ఉన్నాయి. వీక్ డేస్ లో ఒక రేట్, వీకెండ్ లో మరోలా టికెట్ రేట్స్ పెట్టుకుంటే ఆడియెన్స్ ను థియేటర్స్ కు ఆకర్షించవచ్చు. ప్రేక్షకుల మీద భారం వేయకుండా వారికి వీలైనంత తక్కువలో ఎలా వినోదం అందిస్తామనేది ఆలోచించాలి.  చిత్ర పరిశ్రమలోని గౌరవ పెద్దలంతా ఈ సమస్యల మీద ముందు దృష్టి సారించాలి. ఆడియెన్స్ థియేటర్స్ కు వస్తే ఎగ్జిబిటర్స్ బాగుంటారు. వారి సమస్యలు పరిష్కారమవుతాయి. అందరికీ ఆదాయం లభిస్తుంది. అత్యవసరంగా ఆస్పత్రికి వచ్చిన పేషెంట్ కు ఫేషియల్ చేస్తామని ఎవరూ అనరూ. బతికించాలని ప్రయత్నిస్తారు. ఇబ్బందుల్లో ఉన్న మన తెలుగు సినిమాను బతికించుకునే ప్రయత్నం చేయాలి. ఎవరో ఒకరు అమెరికాలో ఓ పది మంది ఉన్న థియేటర్ లో ఎర్లీ మార్నింగ్ షో చూసి రివ్యూ ఇస్తారు. కానీ నిండుగా ఉన్న థియేటర్ లో ప్రేక్షకుల మధ్యలో సినిమా చూస్తేనే ఆ రియల్ రెస్పాన్స్ తెలుస్తుంది. రివ్యూస్ ను ఎవరూ ఆపలేరు. అది ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. కానీ సినిమా ఇండస్ట్రీలో మనమంతా భాగమేనని రివ్యూయర్స్ ఆలోచించాలి. మన సినిమాను బతికించుకునేందుకు మనమంతా ఒక్కటిగా ప్రయత్నించాలి. అన్నారు.
 
 
 
గంగా ఎంటర్టైన్మెంట్స్ వారి
ద్విభాషా చిత్రం 
స్పోర్ట్స్ కోర్ట్ డ్రామా ‘గుర్తింపు’ 
ఫస్ట్ లుక్ విడుదల
-------------------------------
స్వస్తిక్ విజన్స్ సమర్పణలో  గంగా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో
కేజేఆర్ హీరోగా తెన్‌పతియాన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న చిత్రం ‘గుర్తింపు’. స్పోర్ట్స్ కోర్ట్ డ్రామాగా రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను ఈరోజు రిలీజ్ చేశారు. యథార్థ సంఘటనల ఆధారంగా ‘గుర్తింపు’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
 
నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి మాట్లాడుతూ- " పేదరికంలో ఉన్న ఓ వ్యక్తి.. తన కలల్ని నెరవేర్చుకునేందుకు క్రీడా రంగంలో ఎదిగిన తీరు, క్రీడా రంగంలో గుర్తింపు కోసం పడిన శ్రమ, చేసిన ప్రయాణం, ఎదుర్కొన్న సవాళ్లను అందరికీ కనెక్ట్‌ అయ్యేలా ఎమోషనల్ డ్రామాగా ‘గుర్తింపు’ సినిమాను రూపొందిస్తున్నాo. ఇప్పటికి 85 శాతం షూటింగ్ పూర్తయింది. ఇంతకు ముందు మా సంస్థలో శివ కార్తికేయన్ చిత్రాన్ని ‘ వరుణ్ డాక్టర్‘ పేరుతో అనువదించి మంచి విజయాన్ని అందుకున్నాo. ఇటీవల అశ్విన్ బాబు హీరోగా ‘శివం భజే’ చిత్రం నిర్మించాను." అని తెలిపారు. 
 
స్పోర్ట్స్, కోర్ట్ డ్రామాగా రానున్న ఈ ‘గుర్తింపు’ చిత్రంలో కేజేఆర్, సింధూరి విశ్వనాథ్, విజి వెంకటేష్, రంగరాజ్ పాండే, మన్సూర్ అలీ ఖాన్, రమా, మోహన్ రామ్, ఆంటోనీ, అజిత్ ఘోషి, విమల్, ఇజబెల్లా, షాన్, దీపిక, జానకి, అరుల్ జ్యోతి వంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం : జిబ్రాన్, కెమెరామెన్ : ఎ. విశ్వనాథ్, యాక్షన్ :పీటర్ హెయిన్, ఎడిటర్ :శాన్ లోకేష్, ఆర్ట్ డైరెక్టర్ : రాము తంగరాజ్, 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు