ప్రపంచ కప్: వెస్టిండీస్‌పై భారత్ విజయం

ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న మహిళల ప్రపంచ కప్‌ సూపర్ సిక్స్ పోటీల్లో భాగంగా గురువారం జరిగిన సూపర్‌సిక్స్ పోటీలో భారత మహిళా జట్టు విజయం సాధించింది. సిడ్నీలోని ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ మహిళా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల బౌలింగ్‌ను ఎదుర్కొనలేక 44.4 ఓవర్లలో కేవలం 84 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో ఓపెనర్ టేలర్ (29), లావిన్ (20), జాక్ (11), లెవిస్ (12) మినహా మిగిలిన బ్యాట్స్‌ఉమెన్స్ ఎవరూ రెండంకెల స్కోరు చేయలేక పోయారు.

భారత బౌలర్లలో రాయ్ నాలుగు వికెట్లు తీసి విండీస్ నడ్డి విరిచింది. అలాగే శర్మా రెండు వికెట్లు తీయగా, సుల్తాన్, రౌట్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. అనంతరం 85 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళా క్రికెటర్లు కేవలం 17.5 ఓవర్లలోనే 86 పరుగులు చేసి విజయం సాధించారు. ఓపెనర్ నాయక్ 48 బంతుల్లో ఐదు ఫోర్లతో 39 పరుగులు చేయగా, రాజ్ 41 బంతుల్లో నాలుగు ఫోర్లతో 34 పురుగుల చేసి జట్టుకు విజయాన్ని అందించారు.

వెబ్దునియా పై చదవండి