ఫడ్‌లైట్లను ఉపయోగించం: ఐసిసి మ్యాచ్ రెఫరీ

భారత్‌-న్యూజిలాండ్‌ల మధ్య జరిగే టెస్ట్ సిరీస్‌కు ఫడ్‌లైట్లను ఉపయోగించే ప్రసక్తే లేదని ఐసిసి మ్యాచ్ రెఫరీ ఆలన్ హస్ట్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇరు జట్ల మధ్య హామిల్టన్‌లోని సెడెన్ పార్కులో తొలి టెస్ట్ ప్రారంభమైన విషయం తెల్సిందే. కాగా, మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా మిగిలిన రెండు టెస్ట్‌లు జరిగే ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 గంటలకుపైన వెలుతురు మందగిస్తుంది. ఆ తర్వాత ఫడ్‌లైట్ల వెలుతురులో మ్యాచ్‌లు ఆడేందుకు ఇరు జట్లు సంసిద్ధంగా లేవు.

దీనిపై మ్యాచ్ రెఫరీ మాట్లాడుతూ ఫడ్‌లైట్‌ల సౌకర్యం అందుబాటులో ఉన్న స్టేడియాల్లో కెప్టెన్లు కోరిన పక్షంలోనే ఫడ్‌లైట్లను వినియోగిస్తామన్నారు. ప్రస్తుతం తొలి టెస్ట్ హామిల్టన్‌లో జరుగుతోంది. రెండో టెస్ట్ మెక్‌లీన్ పార్కులోనూ, మూడో టెస్ట్ మూడో నేపియర్‌లోనూ జరుగనుంది.

ఈ స్టేడియాల్లో ఫడ్‌లైట్ల సౌకర్యం ఉంది. అయినప్పటికీ, ఇరు జట్ల కెప్టెన్లు సాధారణ వెలుతురులోనే మ్యాచ్‌లు కొనసాగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లు స్థానిక కాలమానం (కివీస్) ప్రకారం మధ్యాహ్నం 11 గంటలకే మ్యాచ్‌లను ప్రారంభించాలని కివీస్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది.

వెబ్దునియా పై చదవండి