భారత్‌కు ఆ సత్తా ఉంది: డియాన్

ట్వంటీ-20 మ్యాచుల్లో ఓటమి పాలైనంత మాత్రాన భారత్‌ను తక్కువ అంచనా వేయడం సరికాదని, ఓటమిని చవిచూసినా తిరిగి పుంజుకునే సత్తా భారత్‌కు ఉందని న్యూజిలాండ్ జాతీయ సెలక్టర్ డియాన్ నాష్ అన్నాడు. భారత్‌ను తక్కువగా అంచనా వేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని డియాన్ సూచించాడు.

భారత్ ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టని, వన్డే, టెస్టు సిరీస్‌లో టీం ఇండియా విజృంభించి ఆడే అవకాశాలు అధికంగా ఉన్నాయని డియాన్ తెలిపాడు. వన్డేల్లో ఏమాత్రం ధీటుగా ఆడపోతే ఫలితం వేరే విధంగా ఉంటుందని ఆయన అన్నాడు. ట్వంటీ-20ల కంటే వన్డేలు, టెస్టుల్లోనే భారత్‌ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవుతోందని, ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించే పలువురు ఆటగాళ్లు ప్రత్యర్థి జట్టులో ఉన్నారని కివీస్‌ మాజీ సారథి అన్నాడు.

కివీస్‌ వాతావరణానికి భారత ఆటగాళ్లు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారని, మరో ఒకటి రెండు మ్యాచులు ఆడితే మరింత పుంజుకోవడం ఖాయమన్నాడు. ఈ నేపథ్యంలో కివీస్‌ ఆటగాళ్లు జాగ్రత్తగా ఆడాల్సిన అవశ్యం ఎంతైనా ఉందని డియాన్ తెలిపాడు.

వెబ్దునియా పై చదవండి