మాస్టర్ బ్లాస్టర్ ఖాతాలో 42వ సెంచరీ!

న్యూజిలాండ్‌తో హామిల్టన్‌లో జరుగుతున్న తొలి టెస్టులో భారత మాస్టర్ బ్లాస్టర్ విజృంభించాడు. మైదానంలో ప్రత్యర్థి జట్టును తన బ్యాటింగ్‌తో హడలెత్తింపజేశాడు. కివీస్ బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొంటూ, 260 బంతుల్లో 26 ఫోర్లతో సచిన్ 160 పరుగులు చేశాడు. దీంతో టెస్టుల్లో 42వ సెంచరీని సచిన్ తన ఖాతాలో వేసుకున్నాడు.

అంతేగాకుండా.. మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోరు సంపాదించి పెట్టడంలో సచిన్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే టెస్టు క్రికెట్‌లో అత్యధిక శతకాలు సాధించిన సచిన్, హామిల్టన్‌లో శతకం చేసి తన రికార్డును మెరుగు పరుచుకున్నాడు.

ఇదిలా ఉండగా.. కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 520 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో కివీస్‌పై టీం ఇండియాకు 241 పరుగుల ఆధిక్యం సాధించినట్లైంది.

వెబ్దునియా పై చదవండి