200వ వన్డే ఆడుతున్న తొలి భారత వికెట్ కీపర్‌గా ధోనీ
మంగళవారం, 14 ఫిబ్రవరి 2012 (12:03 IST)
భారత్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ మంగళవారం శ్రీలంకతో అడిలైడ్‌లో జరుగుతున్న మ్యాచ్‌తో భారత్ తరుపున 200వ అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న తొలి వికెట్ కీపర్‌గా రికార్డ్‌ల్లోకి ఎక్కాడు. భారత్ జట్టు సారథిగా ఇప్పటికే భారత్‌కు రెండు ప్రపంచ కప్‌లు 2007లో జరిగిన తొలి ట్వంటీ-20 ప్రపంచ కప్‌తో పాటు 28 సంవత్సరాలుగా వేచి ఉన్న భారత్ అభిమానుల ప్రపంచకప్ 2011ను అంధించటంలో కీలక పాత్ర పోషించాడు.
ఇప్పటికే తన కీర్తి కిరీటంలో ఎన్నో మైళురాళ్లను అధిగమించిన ఈ ధోనీ... భారత్‌లో మిలియన్ డాలర్ల ఐపీఎల్లో చెన్నై జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ జట్టును ధోనీ తన నాయకత్వం పటిమ కారణంగా రెండు సార్లు ఛాంపియన్‌గా నిలబెట్టాడు.
కాగా భారత్ జట్టు తొలి కీపర్‌గా ఈ మైలు రాయిని అధిగమించిన ధోని ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఐదో వికెట్ కీపర్‌గా రికార్డును సొంతం చేసుకున్నాడు. ధోనీ కంటే ముందు వరుసలో దక్షణాఫ్రికాకు చెందిన మార్క్ బౌచర్ (294), ఆస్ట్రేనియాకు చెందిన ఆడమ్ గిల్‌క్రిస్ట్ (282), శ్రీలంకకు చెందిన సంగక్కర (269), పాకిస్థాన్‌కు చెందిన మోయిన్ ఖాన్ (211)లు ఈ ఘనత సాధించిన వారిలో ఉన్నారు.