ఐపీఎల్-3 సెమీఫైనల్: ముంబైకి మ్యాచ్ల వేదిక మార్పు!
FILE
బెంగళూరులో జరగాల్సిన ఐపీఎల్ సెమీఫైనల్ మ్యాచ్ల వేదికలను ముంబైకి మార్పిడి చేశారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన జంటపేలుళ్ల సంఘటనను దృష్టిలో పెట్టుకుని, ఇక్కడ జరగాల్సిన ఐపీఎల్ సెమీఫైనల్ మ్యాచ్లను ముంబైకి మార్పు చేసినట్లు ఐపీఎల్ యాజమాన్యం ఆదివారం ప్రకటించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్లో భాగంగా.. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుల మధ్య శనివారం 52వ లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ప్రారంభమయ్యేందుకు ఒక గంట ముందు స్టేడియంలోని జనరేటర్ గదిలో బాంబు పేలుడులో సంభవించింది. ఈ పేలుడులో 15 మందికి గాయాలు తగిలాయి.
దీంతో ఐపీఎల్ సెమీఫైనల్ మ్యాచ్ల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా యాజమాన్యం వేదికను మార్చింది. ఇందులో భాగంగా ఐపీఎల్ సెమీఫైనల్ మ్యాచ్లను బెంగళూరు నుంచి ముంబైకి తరలించింది. ఇంకా భద్రతా కారణాల దృష్ట్యా ఐపీఎల్ సెమీఫైనల్ మ్యాచ్లు ముంబైలో జరుగుతాయని భారత క్రికెట్ నియంత్రణ మండలి తెలిపింది.
ఇకపోతే.. ఈ నెల 21, 22 తేదీల్లో ముంబైలోని పటేల్ మైదానంలో ఐపీఎల్ సెమీఫైనల్ మ్యాచ్లు జరుగుతాయి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో శనివారం జరిగిన జంట పేలుళ్లను అనుసరించి పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. దీంతో స్టేడియంకు సమీపంలో మరో మూడు బాంబులను కనుగొన్నారు.