కొచ్చి వేలం పాటలో తలదూర్చడం తప్పేమీలేదు: శశిథరూర్

PTI
ఇండియన్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్‌ కోసం జరిగిన కొచ్చి ఫ్రాంచైజీ వేలం పాటలో తలదూర్చడం తప్పేమీ లేదని కేంద్ర మంత్రి శశిథరూర్ స్పష్టం చేశారు. కేరళ రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే కొచ్చి ఫ్రాంచైజీ వేలం పాటలో పాల్గొన్నానని మంత్రి పేర్కొన్నారు.

కేరళ పర్యాటకాభివృద్ధితో పాటు యువక్రికెటర్లకు అవకాశం కల్పించే దిశగా ఫ్రాంచైజీ వ్యవహారంలో జోక్యం చేసుకున్నానని శశిథరూర్ వెల్లడించారు. అంతేగానీ.. తనపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని మంత్రి పేర్కొన్నారు.

కొచ్చి ఫ్రాంచైజీ వ్యవహారంలో తనపై వెలువెత్తిన ఆరోపణలతో ఆవేదనకు గురైయ్యానని శశిథరూర్ వెల్లడించారు. ఇంకా చెప్పాలంటే..? కొచ్చి ఫ్రాంచైజీని కొనుగోలుకు సహాయం చేయడానికి బదులు తానే ఆ జట్టును కొనుగోలు చేసి వుండవచ్చునని శశిథరూర్ చెప్పారు. మొత్తానికి కొచ్చి ఫ్రాంచైజీ జట్టును కొనుగోలు చేయకపోవడమే తన తప్పని మంత్రి చెప్పారు.

వెబ్దునియా పై చదవండి