మాస్టర్స్ ట్వంటీ20కి టెండూల్కర్, దినేశ్ దూరం

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, దినేశ్ కార్తీక్‌లను మాస్టర్స్ ట్వంటీ20 మ్యాచ్‌లో ఆడకుండా బీసీసీఐ అడ్డుకుంది. ఐసీఎల్ ఆటగాడు హమీష్ మార్షల్ న్యూజిలాండ్ క్రికెటర్ల సంఘం జట్టులో ఉన్నందున సచిన్, కార్తీక్ ట్వంటీ20 మ్యాచ్‌లో ఆడరని శుక్రవారం ఉదయం న్యూజిలాండ్ క్రికెటర్ల సంఘం స్పష్టం చేసింది.

కానీ భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని భావించిన బోర్డు వెంటనే జాగ్రత్త పడినట్లు సమాచారం. దీంతో ఎన్‌జెడ్‌సీపీఏ జట్టులో సచిన్, ఆస్ట్రేలియన్ క్రికెటర్ల సంఘం మాస్టర్స్ జట్టులో కార్తీక్ లేకుండానే శుక్రవారం మ్యాచ్ నిర్వహించారు.

వెబ్దునియా పై చదవండి