గణాంకాల ప్రకారం ప్రపంచకప్‌లో బ్రెట్ లీ డేంజరస్ బౌలర్!

FILE
గణాంకాల ప్రకారం ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ బ్రెట్ లీ వన్డే ప్రపంచకప్‌లో అత్యుత్తమ బౌలర్‌గా రాణిస్తాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో స్టార్ బౌలర్‌గా బరిలోకి దిగే బ్రెట్ లీ, ఇప్పటివరకు 10 ప్రపంచకప్ పోటీల్లో 22 వికెట్లు పడగొట్టాడు. తద్వారా 17.91 సగటును కలిగివున్నాడు.

ఒక్కో బంతికి ఒక్కో వికెట్ అనే స్ట్రైక్‌ రేటును కలిగివున్న బ్రెట్‌లీ, ప్రతి నాలుగో ఓవర్‌కు వికెట్లను పడగొట్టాడు. ఇదే బ్రెట్ లీ మినహా వేరొక బౌలర్ ప్రపంచకప్‌లో సాధించని రికార్డు కావడం విశేషం.

మెక్రా, డేనిస్ లిల్లికి తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన ఫాస్ట్ బౌలర్‌గా బ్రెట్‌లీ రాణిస్తాడు. ఒక గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతివిసిరే బ్రెట్‌లీ, వన్డే, టెస్టు ఫార్మాట్‌లలో 600 వికెట్లు సాధించాడు. దీంతో భారత ఉపఖండంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్‌లో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపించడం ఖాయం. బ్రెట్‌లీతో పాటు షాన్ టైట్ కూడా ఫాస్ట్ బౌలింగ్ ద్వారా విజృంభిస్తే ఆస్ట్రేలియా జట్టు వన్డే ప్రపంచకప్ గెలిచే అవకాశం ఉంది.

ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు తరపున 34 వన్డే మ్యాచ్‌లాడిన బ్రెట్‌లీ 64 వికెట్లు పడగొట్టాడు. ఇందులో భారత్‌తో జరిగిన 29 మ్యాచ్‌ల్లో మాత్రం బ్రెట్ లీ 50 వికెట్లు సాధించాడు. ఇంకా న్యూజిలాండ్‌తో జరిగిన 27 మ్యాచ్‌ల్లో 51 వికెట్లు, పాకిస్థాన్‌తో జరిగిన 20 మ్యాచ్‌ల్లో 34, దక్షిణాఫ్రికాతో జరిగిన 20 మ్యాచ్‌ల్లో 40 వికెట్లు, శ్రీలంకతో జరిగిన 19 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు, వెస్టిండీస్‌తో జరిగిన 21 మ్యాచ్‌ల్లో 41 వికెట్లు పడగొట్టాడు. తద్వారా బ్రెట్‌లీ అగ్రజట్లతో పోటీ పడేందుకు సై అనే క్రీడాకారుడని స్పష్టంగా తెలుస్తోంది.

ముఖ్యంగా రికీ పాంటింగ్ కెప్టెన్సీలో బ్రెట్ లీ 133 మ్యాచ్‌ల్లో 242 వికెట్లు సాధించడం గమనార్హం. అందుచేత వన్డే ప్రపంచకప్‌లో బ్రెట్‌లీని ఎలా ఉపయోగించుకోవాలని బాగా తెలిసిపెట్టుకున్నాడు. అలాగే డే/నైట్ మ్యాచ్‌ల్లో బ్రెట్‌లీ అద్భుత బౌలర్ అని పేరు కొట్టేశాడని గణాంకాల ద్వారా తెలుస్తోంది. 114 వన్డే డే/నైట్ మ్యాచ్‌ల్లో బ్రెట్ లీ 197 వికెట్లు సాధించాడు.

2000వ సంవత్సరం నుంచి 2011 వరకు ఆస్ట్రేలియా గెలిచిన 138 వన్డేల్లో 268 వికెట్లు సాధించి 20 అనే సగటును కలిగివున్నాడు. ఇంకా ఇటీవల ఆస్ట్రేలియా ఓడిపోయిన 42 మ్యాచ్‌ల్లోనూ బ్రెట్ లీ 51 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. కాబట్టి వన్డే ప్రపంచకప్‌లో ఫాస్ట్ బౌలర్ బ్రెట్‌లీని తక్కువగా అంచనా వేసే ప్రత్యర్థి జట్లు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అందుచేత ప్రత్యర్థి జట్లు బ్రెట్‌లీ డేంజరస్ బౌలర్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని వన్డే మ్యాచ్‌లు ఆడాల్సివుంటుందని క్రీడా విశ్లేషకులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి