తొలి టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి విఫలమైనా, అతను అంతే బలంగా తిరిగి పుంజుకోగలడని ఆస్ట్రేలియా పేసర్ మిషెల్ స్టార్క్ అభిప్రాయపడ్డాడు. ఆ భయం తమ జట్టుకు ఉందని, సిరీస్ ఇంకా ముగిసిపోలేదని అతను అన్నాడు. పుణే టెస్టులో కోహ్లి రెండు ఇన్నింగ్స్‌లలో 0, 13 పరుగులు మాత్రమే చేశాడు.