చెన్నయ్ టెస్టు: బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

గురువారం, 11 డిశెంబరు 2008 (11:00 IST)
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చెన్నయ్‌లో ప్రారంభమైన తొలి క్రికెట్ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ బ్యాంటింగ్ ఎంచుకున్నాడు. 15 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ జట్టు వికెట్ నష్టపోకుండా 34 పరుగులు చేసింది. ఓపెనర్లు ఎ స్ట్రాస్ 42 బంతుల్లో 14 పరుగులు, ఎ కుక్ 50 బంతుల్లో 20 పరుగులు చేసి క్రీజులో నిలదొక్కుకున్నారు.

ముంబై దాడుల అనంతరం చివరి రెండు వన్డేలు ఆడకుండానే స్వదేశానికి పయనమైన ఇంగ్లండ్ జట్టు, భారీ భద్రత హామీతో టెస్టు మ్యాచ్‌లకు హాజరు కావడానికి సమ్మతించింది. వర్షం కారణంగా ఇరు జట్లకు ప్రాక్టీస్ మ్యాచ్‌కు వీలు కుదరలేకపోవడంతో నేరుగా బరిలోకి దిగాయి. చెన్నయ్‌లో తొలి రెండు రోజులూ వర్షం కురిసే అవకాశం ఉంటుందని ప్రకటించినా ఆట నిరంతరాయంగా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇంగ్లండ్ జట్టు: స్ట్రాస్, కుక్, బెల్, కెవిన్ పీటర్సన్ (కెప్టెన్) కాలిన్‌వుడ్, ప్లింటాఫ్, ప్రియర్, స్వాన్, ఆండర్సన్, హార్మిసన్, పనేసర్

భారత్ జట్టు: జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, హర్భజన్ సింగ్, అమిత్ మిశ్రా, సెహ్వాగ్, యువరాజ్ సింగ్, టెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్, ద్రావిడ్, గంభీర్, ఎంఎస్ ధోనీ (కెప్టెన్)

వెబ్దునియా పై చదవండి