నాలుగో వన్డే: బ్యాటింగ్‌కు దిగిన భారత్

భారత్-ఇంగ్లండ్‌ల మధ్య నాలుగో వన్డే సమరం బెంగళూరులో మొదలైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ప్రారంభమైన ఈ డే-నైట్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. నాలుగో వన్డేలో స్థానం దక్కించుకున్న భారత మాస్టర్ బ్లాస్టర్‌‌ సచిన్ టెండూల్కర్ - వీరేంద్ర సెహ్వాగ్‌లు ఓపెనర్లుగా బరిలోకి దిగారు.

ఏడు వన్డేల ఈ సిరీస్‌లో మొదటి మూడు వన్డేల్లో భారత్, ఇంగ్లాండ్‌పై విజయ ఢంకా మోగించిన సంగతి తెలిసిందే. ఈ నాలుగో వన్డేలో సిరీస్ కైవసం చేసుకునే దిశగా భారత్ మైదానంలోకి దిగింది. ఈ వన్డేలో సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్‌ల బ్యాటింగ్ ఇంగ్లాండ్‌ను కష్టాల్లోకి నెట్టుతుందని అభిమానులు వేచి చూస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి