భారత్ బౌలర్ల పట్టు: ఇంగ్లాండ్ 229/5

గురువారం, 11 డిశెంబరు 2008 (17:08 IST)
చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు ముగిసే సమయానికి భారత బౌలర్లు పట్టు సాధించటంతో ఆతిథ్య ఇంగ్లాండ్ 5 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఓపెనర్లు స్ట్రాస్ (123), కుక్ (52) లు మాత్రమే రాణించారు. ఓపెనర్లు ఇద్దరూ తొలి వికెట్‌కు 118 పరుగుల భారీ భాగస్వామ్యం అందించినప్పటికీ, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌లలో నిలకడ లోపించింది.

ఓపెనర్ ఆండ్రూ స్ట్రాస్ 15 ఫోర్లతో 123 పరుగులుచేసి అమిత్ మిశ్రా బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. స్ట్రాస్ కెరీర్‌లో 13వది, భారత్‌పై రెండో సెంచరీ చేయడం గమనార్హం. భారత బౌలర్లు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌లపై ఒత్తిడి పెంచటంతో వారు కేవలం 57 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్‌లు తలా రెండు, అమిత్ మిశ్రా ఒక వికెట్ పడగొట్టాడు.

వెబ్దునియా పై చదవండి