భారీ స్కోరు దిశగా భారత్ : 362/6

శనివారం, 18 అక్టోబరు 2008 (10:34 IST)
మొహాలీలో ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో టెస్ట్‌లో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. దీంతో భారత్ ప్రస్తుతం ఆరు వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. సౌరవ్ గంగూలీ (70), మహేంధ్రసింగ్ ధోనీ (27) పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఓవర్‌నైట్ స్కోరు ఐదు వికెట్ల నష్టానికి 311 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ 15 పరుగులు జోడించి ఇషాంత్ శర్మ (9) వికెట్‌ను కోల్పోయింది. ఇషాంత్‌శర్మ వికెట్‌ను సిడిల్ దక్కించుకున్నాడు. అంతకుముందు ఈ మ్యాచ్‌లో తొలిరోజు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే.

ఓపెనర్ల శుభారంభానికి తోడు సచిన్ (88) విజృంభించడంతో తొలిరోజు భారత్ భారీస్కోరు దిశగా పయనించింది. తొలిరోజు ఆటలో సచిన్ అత్యధిక టెస్ట్ పరుగుల ప్రపంచ రికార్డును సాధించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సచిన్ 12000 పరుగుల మైలురాయిని సైతం అధిగమించాడు. సచిన్‌తో పాటు గంగూలీ సైతం టెస్టుల్లో 7000 పరుగుల మైలు రాయిని చేరుకోవడం తొలిరోజు మ్యాచ్‌లో విశేషం.

వెబ్దునియా పై చదవండి