రూ.10 లక్షలు మోసం- సోనూ సూద్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్

సెల్వి

శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025 (10:57 IST)
బాలీవుడ్ నటుడు సోను సూద్‌పై పంజాబ్ లోని లూథియానాలోని ఒక కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. లూథియానాకు చెందిన రాజేష్ ఖన్నా అనే న్యాయవాది మోహిత్ శర్మపై "రిజికా కాయిన్" అనే పథకంలో పెట్టుబడి పెడతానని చెప్పి రూ.10 లక్షలు మోసం చేశారని ఆరోపిస్తూ కేసు దాఖలు చేశారు. 
 
ఈ కేసులో సోను సూద్‌ను సాక్షిగా చేర్చారు. కోర్టు నుండి అనేకసార్లు సమన్లు ​​జారీ చేయబడినప్పటికీ, సోను సూద్ సాక్ష్యం కోసం హాజరు కాలేదు. దీంతో, లూథియానా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ రమణ్‌ప్రీత్ కౌర్ ఆయనపై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. 
 
ఈ కేసులో తదుపరి విచారణ ఫిబ్రవరి 10న జరగనుంది. ఇదిలా ఉండగా, సోనూ సూద్ ఇటీవలే ఫతే చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు.దీనికి సానుకూల సమీక్షలు వచ్చాయి. ఈ సినిమా సైబర్ మాఫియా నేపథ్యంలో సాగుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు