అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం తండేల్. ఈ చిత్రం శుక్రవారం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలకానుంది. దీన్ని పురస్కరించుకుని గురువారం సాయంత్రం చిత్ర బృందం హైదరాబాద్ నగరంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది.
ఇందులో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, 'తండేల్' సినిమా టికెట్ ధరలపై కీలక వ్యాఖ్యలు.. ఏపీలో మాత్రమే తండేల్ టికెట్ ధరలను పెంచాలని అడిగాం.. తెలంగాణలో టికెట్ ధరలను పెంచాలని అడగలేదన్నారు. దీనికి కారణం.. తెలంగాణలో ఇప్పటికే టికెట్ ధరలు పెరిగి ఉన్నాయి.. టికెట్ ధరలు రూ.50 పెంచాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరాం.. తెలంగాణలో టికెట్ ధరలు రూ.295, రూ. 395 పెరిగాయి.. తండేల్ బెనిఫిట్ షోలు లేవు, అంత బెనిఫిట్ మాకు వద్దు అని చెప్పారు.
ఈ సినిమాకు అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చయింది. మా వాసుతో పాటు కొంతమంది నా వద్దకు వచ్చి ఎందుకైనా మంచిది సినిమాను ఏరియాల వారీగా అమ్మేద్దామా అని అడిగారు.. నేను సినిమా చూశా.. అమ్మొద్దు.. మనమే విడుదల చేద్దాం అని చెప్పారు. ఈ మూవీ ఈవెంట్‌కు అల్లు అర్జున్ వస్తే ఆయన తర్వాతి చిత్రం లుక్ అందరికీ తెలిసిపోతుందన్న కారణంతోనే రాలేదా అని ప్రశ్నించగా, తండేల్ ఈవెంట్ వరకే పరిమితం చేద్దాం అంటూ సమాధానాన్ని దాటవేశారు.