దక్షిణాఫ్రికాను సొంతగడ్డపై ఓడించి 2-0తో టెస్టు సిరీస్‌ను చేజిక్కించుకున్న ఆస్ట్రేలియా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని సైతం నిలబెట్టుకుంది. డర్బన్‌లో మంగళవారం ముగిసిన రెండో టెస్టులో 175 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన ఆస్ట్రేలియా సొంతగడ్డపై పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది.
రెండో టెస్టులో ఆస్ట్రేలియా విధించిన 546 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడంలో వెనుకబడిన దక్షిణాఫ్రికా 370 పరుగుల పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో రెండో టెస్టులో విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టుకు కొండంత ఊరట లభించింది. 244/2తో మంగళవారం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఏ దశలోనూ స్థిరంగా ఆడలేకపోయింది. దీంతో క్రమంగా వికెట్లు పతనం కావడంతో చివరకు 370 పరుగుల వద్ద తన ఇన్నింగ్స్‌ను ముగించింది.
ఈ మ్యాచ్ అనంతరం ఆసీస్ సారధి పాంటింగ్ మాట్లాడుతూ కొత్త ఆటగాళ్లవల్లే సఫారీలపై తమ విజయం సాధ్యమైందని పేర్కొన్నాడు. జట్టులో కొత్తగా వచ్చిన హ్యూస్, నార్త, హిల్ ఫనాస్‌లు అద్భుతంగాను, నమ్మశక్యం కాని రీతిలోనూ జట్టుకు విజయాన్ని అందించారని పాంటింగ్ పేర్కొన్నాడు.