బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ అరుదైన రికార్డ్‌.. ఏంటది?

సోమవారం, 24 జూన్ 2019 (18:35 IST)
బంగ్లాదేశ్ సీనియర్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో అసాధారణ స్థాయిలో చెలరేగుతూ షకీబ్ 476 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. 
 
షకీబ్ తర్వాతి స్థానాల్లో వార్నర్(447), జో రూట్(424), ఫించ్(396) ఉన్నారు. ఈ స్టార్ ఆల్‌రౌండర్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ బంగ్లాకు ఒంటిచేత్తో విజయాలను అందిస్తున్నాడు. 
 
ఈ క్రికెట్ మెగా టోర్నీలో పరుగుల వరద పారిస్తున్న షకీబ్ వరల్డ్‌కప్ చరిత్రలో వెయ్యి పరుగుల మైలురాయిని పూర్తి చేసుకున్నాడు. కాగా బంగ్లాదేశ్ క్రికెట్ జట్టులో ఈ ఫీట్ సాధించిన ఏకైక ఆటగాడు షకీబ్ కావడం విశేషం. ఈరోజు అఫ్ఘనిస్థాన్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో దవ్లాత్ జద్రాన్ వేసిన 21వ ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసి ఈ రికార్డ్‌కు చేరుకున్నాడు.
 
అయితే ఈ ల్యాండ్‌మార్క్ సాధించిన వాళ్లలో షకీబ్ 19వ ఆటగాడు. నేటి మ్యాచ్‌లోనూ షకీబ్ అర్థశతకంతో మెరిశాడు. భారీ స్కోర్ దిశగా సాగుతున్న షకీబ్ ముజీబ్ బౌలింగ్‌లో ఎల్బీగా అవుటైయ్యాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు