ప్రపంచ కప్‌లో భారత జట్టు అదరగొట్టింది. ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం కెన్నింగ్టన్ ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రికార్డు విజయాన్ని టీమిండియా తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచకప్‌లో వరుసగా రెండో విజయాన్ని సాధించిన జట్టుగా టీమిండియా ఘనత కెక్కింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 352 పరుగుల భారీ స్కోరు నమోదు చేయగా, లక్ష్య ఛేదనలో ఆసీస్ 316 పరుగులకే ఆలౌట్ 36 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
ఈ మ్యాచ్‌లో గెలిచిన భారత జట్టు ఆస్ట్రేలియా పది వరుస విజయాలకు బ్రేక్ వేసినట్లైంది. అలాగే వన్డేల్లే ఆస్ట్రేలియాపై 50 విజయాలు సాధించిన మూడో జట్టుగా కూడా టీమిండియా రికార్డు సాధించింది. భారత్ కంటే ముందు ఇంగ్లండ్, వెస్టిండీస్‌లు ఈ ఘనత సాధించాయి. కాగా, ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో గతంలో మూడుసార్లు భారత్ విజయం సాధించింది.