శ్రీలంకతో లీడ్స్ మ్యాచ్.. భారత్ విజయ లక్ష్యం.. 265 పరుగులు - అదరగొట్టిన మాథ్యూస్

శనివారం, 6 జులై 2019 (19:29 IST)
ఇంగ్లండ్ లీడ్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఏంజెలో మాథ్యూస్ 128 బంతుల్లో 113 (10 ఫోర్లు, 2 సిక్సులు) సెంచరీతో విజృంభించడంతో  టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది.


అలాగే శ్రీలంక బ్యాట్స్‌మెన్లలో  లాహిరు తిరుమన్నే 68 బంతుల్లో 53 (4 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేయడంతో లంక 265 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్‌కు నిర్దేశించింది. భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు తీయగా హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. 
 
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 17 పరుగుల వద్ద శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. నాలుగో ఓవర్‌లో ఆ జట్టు కెప్టెన్ దిముత్ కరుణరత్నెను ఔట్ చేసిన బుమ్రా... ఎనిమిదో ఓవర్‌లో కుశాల్ పెరీరాను ఔట్ చేశాడు. ఈ ఇద్దరూ వికెట్ కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. 
 
ఆ తర్వాత రెండు పరుగులకే అవిష్క ఫెర్నాండో(20)ను హార్దిక్ పాండ్యా ఔట్ చేశాడు. దీంతో 55 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన శ్రీలంకను ఏంజెలో మాథ్యూస్-లాహిరు తిరుమన్నెల జోడీ ఆదుకుంది. ఏంజెలో మాథ్యూస్ 76 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో మాథ్యూస్ హాఫ్ సెంచరీ సాధించగా... ఆ తర్వాత 66 బంతుల్లో 4 పోర్ల సాయంతో తిరుమన్నే సైతం హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 
 
అనంతరం క్రీజులోకి వచ్చిన ధనుంజయ డి సెల్వాతో కలిసి ఏంజెలో మాథ్యూస్ లంక ఇన్నింగ్స్‌ని నడిపించాడు. ఈ క్రమంలో 115 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో సెంచరీ సాధించాడు. ప్రపంచకప్‌లో మాథ్యూస్‌కు ఇది తొలి సెంచరీ కాగా, ఓవరాల్‌గా మూడోది. అయితే, ఈ మూడూ భారత్‌పైనే సాధించినవే కావడం విశేషం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు