పాకిస్థాన్ స్టార్ ప్లేయర్, సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్ చివరి మ్యాచ్ ఆడకుండానే.. రిటైర్మెంట్ ప్రకటించడంపై ఆయన ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తన కెరీర్ ఆఖరి మ్యాచ్.. బంగ్లాదేశ్‌తో ఆడుదామనుకున్న మాలిక్‌కు నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ షోయబ్ మాలిక్ ఫేర్ వెల్ మ్యాచ్‌పై స్పందించాడు.
20 ఏళ్ల కెరీర్‌లో 287 వన్డేల్లో పాక్‌కు ప్రాతినిధ్యం వహించాడు. వన్డేల్లో 34.55 సగటుతో 7,534 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 143. ఇందులో తొమ్మిది సెంచరీలు, 44 అర్థ సెంచరీలు చేశాడు. ఇక 39.19 సగటుతో 158 వికెట్లు కూడా పడగొట్టాడు. 2010లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను పెళ్లి చేసుకున్నాడు. మాలిక్, సానియాలకు ఓ కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే.
భర్త రిటైర్మెంట్‌పై ఆయన భార్య సానియా మీర్జా కూడా ట్విట్టర్లో స్పందించింది. ''మాలిక్ 20 ఏళ్లు నీ దేశం గర్వించేలా ఆడావు. అలాగే ఎంతో గౌరవం, వినయంతో నీ ఆటను కొనసాగించావు. నీవు సాధించిన ప్రతి మైలురాయి పట్ల నేనెంతో గర్వపడ్డా." అని సానియా మీర్జా ట్వీట్ చేసింది.