ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా జూన్ 16వ తేదీన భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య కీలక పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీసేనకే విజయావకాశాలు ఎక్కువగా వున్నాయని.. సర్పరాజ్ నేతృత్నంలో పాకిస్థాన్ జట్టుకు అనుభవం లేదని టీమిండియా స్టార్ బౌలర్ హర్భజన్ సింగ్ అన్నాడు. ప్రస్తుతానికైతే పాకిస్థాన్ ఫామ్‌లో లేదని.. గతంలో జట్టు బలంగా వుండేదన్నాడు.
పాకిస్థాన్ టీమిండియాపై 10 మ్యాచ్‌ల్లో 9 ఓడిపోతుంది. గతంలో ఎంతో బలమైన జట్టుగా ఉన్నా ప్రపంచకప్‌లో ఒక్కసారి కూడా భారత్‌ను ఓడించలేదు. అలాంటిది ఇప్పుడు సర్ఫారాజ్ సేన ఎలా గెలుస్తుంది? అని వెటకారంగా భజ్జీ మాట్లాడాడు. కానీ ప్రపంచకప్‌లో భారత జట్టుపైనే ఎక్కువ ఒత్తిడి ఉంటుందన్నాడు. అందుకే పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో పైచేయి సాధించాలని చెప్పాడు.