ఐసీసీ క్లిష్ట పరిస్థితి : బౌండరీలు కూడా టై అయితే....

మంగళవారం, 16 జులై 2019 (15:05 IST)
ఇటీవల లార్డ్స్ వేదికగా జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ పోటీ ఫలితం సరికొత్త చర్చకు తెరలేపింది. ఇరు జట్ల ప్రధాన స్కోర్లు సమమైతే, సూపర్ ఓవర్ ద్వారా విజేతను ఎంపిక చేస్తున్నారు. ఒకవేళ మ్యాచ్ ప్రధాన ఇన్నింగ్స్‌తో పాటు సూపర్ ఓవర్ కూడా టై అయితే బౌండరీల ద్వారా విజేతను ఎంపిక చేస్తున్నారు. 
 
గత ఆదివారం జరిగిన ప్రపంచ కప్‌ ఫైనల్స్‌లో ఇంగ్లండ్‌ (ప్రధాన ఇన్నింగ్స్‌ బౌండరీలు 24 ప్లస్ సూపర్‌ ఓవర్‌ బౌండరీలు 2=26) బౌండరీలు సాధించింది. అలాగే, న్యూజిలాండ్ (ప్రధాన ఇన్నింగ్స్‌ బౌండరీలు 16 + సూపర్‌ ఓవర్‌ బౌండరీలు 1=17) బౌండరీలు సాధించింది. 
 
ఈ పరిస్థితుల్లో ఆదివారం ఇంగ్లండ్ జట్టును విశ్వవిజేతగా ప్రకటించారు. ఇదిలావుండగా, ఒకవేళ సూపర్‌ ఓవర్‌ టై అయి.. ఇరు జట్ల బౌండరీలు కూడా సమానమైతే అప్పుడేంటి పరిస్థితి. అప్పుడు సూపర్‌ ఓవర్‌లో బాదిన బౌండరీలను మినహాయించి ప్రధాన ఇన్నింగ్స్‌లో ఏ జట్టైతే బౌండరీలతో ఎక్కువ పరుగులు సాధిస్తుందో ఆ జట్టుని విజేతగా తేలుస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు