రోహిత్ శర్మ సిక్సర్ల మోత ... ఎం.ఎస్.ధోనీ రికార్డు బ్రేక్...

మంగళవారం, 2 జులై 2019 (16:56 IST)
టీమిండియా బ్యాట్సమన్ రోహిత్ శర్మ బంగ్లాదేశ్ పైన ఆడుతున్న మ్యాచ్ లో సిక్సర్ల మోత మోగిస్తున్నాడు. ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ క్రీడలో ఒకే మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. దీనితో ధోనీ పేరిట వున్న సిక్సర్ల రికార్డ్ బ్రేక్ అయ్యింది. రోహిత్ శర్మ 5 సిక్సర్లు, 7 ఫోర్లతో 104 పరుగుల వద్ద ఔటయ్యాడు. 
 
ఇకపోతే ఒకే మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్సమన్లుగా విండీస్ బ్యాట్సమన్ గేల్, పాక్ ఆటగాడు ఆఫ్రిది, లంక బ్యాట్సమన్ జయసూర్యలు వున్నారు. వీరి తర్వాతి స్థానంలో రోహిత్ చేరాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు