పైలెట్ పేరుతో నలుగురు అమ్మాయిలను మోసం చేసి యువకుడు

ఆదివారం, 27 ఆగస్టు 2023 (12:16 IST)
గుజరాత్‌లో ఓ నకిలీ పైలెట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తాను పైలెట్ అని నమ్మించి నలుగురు అమ్మాయిలను మోసం చేసిన యువకుడిని అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైకు చెందిన రక్షిత మంగేలా (20) అనే యువకుడు పైలెట్‌గా అవతారమెత్తాడు. ఈయన హైదరాబాద్ నగరంలో ఉన్న తన ప్రియురాలిని కలిసేందుకు వెళుతూ వడోదర ఎయిర్‌పోర్టులో అధికారులకు చికాకుడు. 
 
బోర్డింగ్ సిబ్బందికి తాను ఎయిరిండియా పైలట్‌నంటూ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రక్షిత్‌పై హర్ని ఠాణాలో కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడికి అహ్మదాబాద్, రాజ్‌కోట్, ముంబైతోపాటు నెదర్లాండ్‌లో స్నేహితురాళ్లు ఉన్నట్లు గుర్తించారు. 
 
కేవలం అమ్మాయిలను ప్రేమలో పడేసేందుకే ఇలా ఫేక్ పైలట్ అవతారం ఎత్తాడని తేలాక.. కుటుంబ సభ్యులను పిలిచి అతణ్ని అప్పగించారు. తాను నిజమైన పైలట్ కాదని రక్షితోనే అతడి స్నేహితురాళ్లకు మెసేజ్ పెట్టించారు. వాస్తవానికి పైలట్ కావాలని కలలు కన్న రక్షిత్.. కుటుంబ ఆర్థికపరిస్థితుల కారణంగా ఆ కోరిక తీర్చుకోలేకపోయాడని లీసులు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు